Kodali Nani: గుడివాడ క్యాసినోవా వ్యవహరంలో సీఎం జగన్ తననేమి అనలేదన్న మంత్రి
Continues below advertisement
విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టటాన్ని స్వాగతిస్తూ గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి కొడాలి నాని పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గుడివాడలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను అభాసుపాలు చేసేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.గుడివాడ లో క్యాసినోవో జరిగితే ఇక్కడ ప్రజలకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.గుడివాడ ప్రజలు అంత అమాయకులు కాదన్నారు.టీడీపీ చీర్ బాయిస్ గుడివాడ వచ్చి అల్లరి... అల్లరి చేశారని అన్నారు.దీంతో ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.గుడివాడ క్యాసినోవా విషయంలో...టీడీపీ ఎమి చేస్తుందో అన్ని విషయాలు సీఎం జగన్ కు తెలుసని,ఆయన అమాయకుడు కాదు కాబట్టి,తనను ఏమి అనలేదని మంత్రి వివరించారు
Continues below advertisement