ఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Continues below advertisement

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆ తరవాత ఎవరు ఆ కుర్చీలో కూర్చుంటారు..? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎవరూ ఊహించని విధంగా అతిషి పేరు తెరపైకి వచ్చింది. ఇవాళో రేపో ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సందర్భంగా ఆమె పొలిటికల్ జర్నీకి సంబంధించిన టాప్ పాయింట్స్ ఓ సారి చూద్దాం.

పాయింట్ నంబర్ 1: 2013లో ఆప్‌లో చేరారు అతిషి. విద్యాశాఖలో అడ్వైజర్‌గా తన జర్నీని మొదలు పెట్టిన ఆమె 2020 ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికై...ఓ ఏడాది క్రితం మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మంత్రి అయిన ఏడాదిలోనే సీఎం కూడా అవుతున్నారు.

పాయింట్ నంబర్ 2: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో హిస్టరీలో పీజీ చేశారు అతిషి. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన రోడ్స్ స్కాలర్‌షిప్‌ని పొందారు. ఏపీలోని మదనపల్లెలో జిడ్డు కృష్ణ మూర్తి స్థాపించిన రిషి వ్యాలీ ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లీష్, హిస్టరీ సబ్జెక్ట్స్ టీచ్ చేశారు. 

పాయింట్ నంబర్ 3:  ఢిల్లీ చరిత్రలో మూడో మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సాధించనున్నారు అతిశి. అంతే కాదు. ప్రస్తుతం భారత్‌లో యంగెస్ట్ చీఫ్ మినిస్టర్‌గానూ చరిత్ర సృష్టించారు. 

పాయింట్ నంబర్ 4: అతిషి ఫ్యామిలీది లెఫ్టిస్ట్ భావజాలం. తల్లిదండ్రులు ఆమె పేరులో మార్క్స్, లెనిన్ పేర్లు వచ్చేలా అతిషి మర్లేనా అని పెట్టారు. అయితే..2019 ఎన్నికల సమయంలో తన ఇంటి పేరుని తొలగించుకున్నారు. ఇకపై అతిషిగానే పిలవాలని ప్రకటించారు. 

పాయింట్ నంబర్ 5: అతిషి కొన్ని కాంట్రవర్సీల్లో కూడా చిక్కుకున్నారు. రౌడీలకైనా ఓటు వేయండి కానీ బీజేపీ వాళ్లకు ఓటు వేయొద్దని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్ట్ అఫ్జల్ గురుని ఉరి తీయొద్దని పదేపదే పిటిషన్‌లు వేశారని..ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా కాంట్రవర్సీ అవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram