రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

బీజేపీపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. రాహుల్ గాంధీ హత్యకు కుట్ర చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి రణ్‌వీత్ సింగ్ బిట్టు చేసిన కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలోని తుగ్లక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. బీజేపీ నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నారని మండి పడింది. రణ్‌వీత్ బిట్టుతో పాటు మరి కొందరు నేతలపైనా కాంగ్రెస్ ఫిర్యాదుచేసింది. అయితే..ఈ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు బారికేడ్‌లు ఏర్పాటు చేయగా..వాటిపైకి ఎక్కి మరీ నిరసన తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు. రణ్‌వీత్ సింగ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆయన దిష్టిబొమ్మని తగలబెట్టారు. ఈ ఆందోళనల్లో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ కూడా పాల్గొన్నారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక శివసేన నేత కూడా రాహుల్ నాలుక కోస్తే నజరానా ఇస్తానంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola