Ratan Tata Passed Away | తుదిశ్వాస విడిచిన గొప్ప పారిశ్రామికవేత్త రతన్ టాటా | ABP Desam

Continues below advertisement

 దేశం గర్వించదగిన పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా ఇక లేరు. అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన 86సంవత్సరాలు. 1937లో నావల్ టాటా, సోనీ టాటాలకు జన్మించిన ఆయన..పదేళ్ల వయస్సులోనే తల్లితండ్రులు విడిపోవటంతో నానమ్మ దగ్గర పెరిగారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఆయన టాటాల వారసుడిగా ఆ సంస్థల్లో అప్రెంటిస్ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి..మేనేజర్ స్థాయి ఉద్యోగాల వరకూ చేరుకున్నారు. తనను తాను సమర్థుడిగా ప్రూవ్ చేసుకున్న తర్వాతనే 1990లో టాటా సంస్థల ఛైర్మన్ గా రతన్ టాటా బాధ్యతలను అందుకున్నారు. టీసీఎస్ లాంటి దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించిన రతన్ టాటా...ఎప్పుడూ సామాన్యూడి కోణంలోనే దేశాన్ని చూసేవారు. మధ్యతరగతి ప్రజల బాగోగుల కోసమే ఆలోచించేవారు. విపత్తులు, వరదల సమయాల్లో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వాలకు విరాళాలుగా అందిస్తూ ఎంతో దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆయన వ్యాపార, సేవారంగాల్లో అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ తో సత్కరించింది. 2017లో టాటా కంపెనీల బాధ్యతల నుంచి తప్పుకున్న రతన్ టాటా కేవలం టాటా ట్రస్ట్ లకు మాత్రమే ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram