PM Modi celebrates Diwali at Kutch | దేశ సరిహద్దుల్లో సైనికులతో మోదీ దీపావళి సంబరాలు | ABP Desam

Continues below advertisement

 ప్రధాని నరేంద్రమోదీ ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి సంబరాలు నిర్వహించారు. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో పర్యటించిన మోదీ బీఎస్ఎఫ్ భద్రతా దళాల వద్దకు బోటు పై వెళ్లారు. ఆయన కూడా BSF యూనిఫామ్ ధరించారు. బోటులో సముద్రజలాల్లో పహారా కాస్తున్న BSF జవాన్లకు మిఠాయిలు తినిపించారు. భారత్ ను పాక్ ను వేరుచేస్తూ అరేబియా సముద్రంలో నుంచి చొచ్చుకువచ్చిన ఉప్పుతో అక్కడ తెల్లటి నేలలు ఏర్పడ్డాయి. వాటినే రానా ఆఫ్ కచ్ అంటారు. గుజరాత్ లోని కచ్ నుంచి పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ వరకూ ఉండే ఈ బోర్డర్లో మన సైనికులు పహారా కాస్తుంటారు. చాలా కఠినమైన పరిస్థితుల్లో పనిచేసే అక్కడి సైనికులను కలిసిన ప్రధాని మోదీ..జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు.  దేశ సరిహద్దుల్లో సైనికులతో మోదీ దీపావళి సంబరాలు చేసుకున్న ఆర్మీ జవాన్లతో దీపావళి కచ్ లో బోటుపై తిరుగుతూ విడుదలైన మోదీ వీడియోలు వైరల్ అవుతున్నాయి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram