ఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు
ఇజ్రాయేల్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలమైందో అందరికీ తెలిసిందే. అందుకే...ఒకేసారి ఇరాన్, హెజ్బుల్లా, హమాస్‌తో యుద్ధం చేస్తోంది ఈ దేశం. అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతోంది. అయితే...ఇజ్రాయేల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరింత బలంగా ఉంది. ఇటీవల ఇరాన్‌పై గగనతలం నుంచి దాడులు చేయడంలో కీలక పాత్ర పోషించింది ఎయిర్ డిఫెన్స్. ఈ క్రమంలోనే ఇటీవల నార్త్ ఇజ్రాయేల్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసింది సైన్యం. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ సైరన్‌లు వినిపించాయి. ఆ ప్రాంతమంతా ఆ శబ్దంతో మారుమోగింది. ఆ తరవాత పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ సైరన్‌లు వినిపించిన వెంటనే ఇజ్రాయేల్‌లోని మెడికల్ ఎమర్జెన్సీ టీమ్ అప్రమత్తమైంది. పేలుళ్లు జరిగిన చోటకు వెళ్లి సహాయం అందించేందుకు సిద్ధమయ్యాయి. నార్త్ ఇజ్రాయేల్‌పై లెబనాన్ భీకరంగా దాడులు చేస్తోంది. వీటిని అడ్డుకునేందుకు ఇజ్రాయేల్ సైన్యం ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేస్తోంది. వీటితోనే హెజ్బుల్లా మిజైల్స్, రాకెట్స్‌ని తిప్పి కొడుతోంది ఇజ్రాయేల్ ఆర్మీ.