Nita Ambani on Ratan Tata | రతన్ టాటాపై నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు | ABP Desam

Continues below advertisement

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు రిలయన్స్ సంస్థ, ఉద్యోగులు నివాళి అర్పించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి కార్యక్రమంలో నీతా అంబానీ మాట్లాడుతూ.. రతన్‌ టాటా గొప్పతనాన్ని వివరించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన గౌరవార్థం అందరూ ఓ నిమిషం పాటు మౌనం పాటించాలని కోరారు. రతన్‌ టాటాను గ్రేట్‌ సన్‌ ఆఫ్‌ ఇండియాగా నీతా అంబానీ అభివర్ణించారు. నాలుగు రోజుల క్రితం మనం ఓ గ్రేట్ సన్ ఆఫ్ ఇండియాని కోల్పోయాం. ఆయనే శ్రీ రతన్ టాటా. ఆయన చనిపోవడం మనందరిలో దు:ఖాన్ని నింపింది. రతన్ టాటా మా మామగారికి, ముకేశ్ అంబానీకి చాలా దగ్గరి స్నేహితులు. అలాగే ఆకాశ్ అంబానీకి గురువు. ఆయన దూరదృష్టి గల పారిశ్రామికవేత్త. పరోపకారి. ఎప్పుడూ సమాజ గొప్ప శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. ఈ విషాద సమయంలో రతన్ టాటా గారి గౌరవార్థం ఒక నిమిషం పాటు మౌనం పాటించాలని కోరుతున్నాను.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram