తమిళ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్, ఆ ట్వీట్‌ల అర్థమేంటి?
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళ రాజకీయాలపై ఈ మధ్య ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అన్నా డీఎమ్‌కేకి బెస్ట్ విషెస్ చెప్తూ తమిళంలో ట్వీట్ చేశారు పవన్. ఆ తరవాత అదే ఇంగ్లీష్‌లోనూ పోస్ట్ చేశారు. అయితే..అన్నా డీఎమ్‌కే పార్టీని 1972లో అక్టోబర్ 17వ తేదీన ఎమ్‌జీఆర్ ప్రకటించారు. తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ పవన్ ట్వీట్ పెట్టారు. పురచ్చి తలైవర్ ఎమ్‌జీఆర్ స్థాపించిన పార్టీ తమిళ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిందని కొనియాడారు. పేదల సంక్షేమం గురించి ఆలోచించిన MGR స్ఫూర్తిగానే పని చేస్తామని వెల్లడించారు. పరిపాలనలో ఆయనకున్న విజనరీ చాలా గొప్పదని అని పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఆ తరవాత ఆయన వారసత్వాన్ని జయలలిత కొనసాగించారని పోస్ట్‌లో మెన్షన్ చేశారు.
అందరితోనూ అమ్మ అనిపించుకున్నారని కొనియాడారు. అయితే..అంతకు ముందు అక్టోబర్ 6వ తేదీన కూడా అన్నా డీఎమ్‌కే గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ పెట్టారు పవన్. ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశారు. ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే...తమిళనాడు డిప్యుటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కి ఈ మధ్యే గట్టి వార్నింగ్ ఇచ్చారు పవన్. సనాతన ధర్మం గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోనంటూ హెచ్చరించారు. ఇప్పుడు అన్నా డీఎమ్‌కేని ప్రశంసిస్తూ..ఇన్‌డైరెక్ట్‌గా అధికార డీఎమ్‌కేకి చురకలు అంటిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. పైగా...ఉదయనిధి స్టాలిన్‌తో సనాతన ధర్మ వివాదం తరవాత ఈ పోస్ట్ పెట్టడం రకరకాల చర్చలకు దారి తీస్తోంది. తమిళనాడులోనూ జనసేనని తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అన్న మరో డిబేట్ కూడా ఉంది. పైగా..ఈ మధ్య తమిళనాడులో ఓ వీడియో వైరల్ అయింది. సిరిమానోత్సవంలో పవన్ కల్యాణ్ పోస్టర్ కనిపించింది. అప్పటి నుంచే పవన్..తమిళనాడు పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వాలంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.