Customer Set Fire Bike Showroom | Karnataka లో వైరల్ గా మారిన బైక్ షోరూం దగ్ధం కేసు | ABP Desam
కొత్త బండి ట్రబుల్ ఇస్తే ఏం చేస్తాం..కొన్న షో రూమ్ వాళ్లకు కంప్లైట్ చేస్తాం..మరీ మాట వినకపోతే గొడవ పడతాం అంతేగా...కానీ కర్ణాటకలో ఓ వ్యక్తి ఏకంగా ఆ బైక్ షోరూమ్ నే తగులబెట్టాడు. కర్ణాటకలోని కలబుర్గిలో జరిగింది ఈ ఘటన. 26ఏళ్ల మహ్మద్ నదీమ్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం లక్షా 40వేలు పెట్టి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్నాడు. అయితే కొన్న రెండు రోజులకే అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తోంది. షోరూమ్ కి తీసుకు వస్తే ..సూపర్ వైజర్లు పట్టించుకోలేదని..వాళ్లతో గొడవపడ్డాడు. బ్యాటరీ బాగోలేదని..సౌండ్ కూడా తేడాగా వస్తోందని..ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదంటూ వాగ్వాదానికి దిగాడు. అది కాస్తా గొడవ పెద్దదై పెట్రోల్ తీసుకు వచ్చి ఆ ఓలా షో రూమ్ కు నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆరు బైక్స్ తో పాటు కంప్యూటర్లు కాలిపోయాయి. ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆపేందుకు యత్నించినా..అవి కాలి బూడిదయ్యాయి. దగ్ధమైన బైకులు, కంప్యూటర్ల విలువ ఎనిమిదన్నర లక్షల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నదీమ్ ను అరెస్ట్ చేశారు.