Chennai Air Show 2024 Tragedy | విషాదం మిగిల్చిన చెన్నై ఎయిర్ షో | ABP Desam

Continues below advertisement

చెన్నైలోని మెరీనా బీచ్‌లో జరిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో..చివరకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. లక్షలాది మంది ఈ షో చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. అప్పటికే ఎండ, ఉక్కపోతతోనే అల్లాడిపోయిన జనాలు ఈ తొక్కిసలాటతో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 230 మంది డీహైడ్రేషన్‌కి గురై స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఎయిర్‌ షోకి 15 లక్షల మందికిపైగా వచ్చినట్టు అంచనా. అయితే...ఇంత మందిని హ్యాండిల్ చేయడంలో అధికారులు ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడంలోనూ విఫలమయ్యారని మండి పడుతున్నారు. మెరీనా బీచ్‌కి సమీపంలోని అన్ని రైల్వే స్టేషన్‌లు కిక్కిరిసిపోయాయి. ఆయా స్టేషన్‌లలోనూ తొక్కిసలాట జరిగింది. మెట్రో స్టేషన్‌లోనూ ఇదే పరిస్థితి. ఇదంతా చూసి స్థానికులే స్పందించారు. డీహైడ్రేషన్‌కి గురైన వాళ్లకి తాగు నీళ్లు ఇచ్చి సాయం చేశారు. అయితే...ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రంగా మండి పడ్డారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమేనని విమర్శించారు. ఫ్యామిలీ పాలిటిక్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రజల భద్రతపై లేదని చురకలు అంటించారు. సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు అన్నామలై.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram