Jammu and Kashmir: ముస్లిం ఇలాకాలో హిందూ మహిళ సత్తా! ఈమె గురించి తెలిస్తే కన్నీళ్లే!
జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కిశ్వర్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసిన షగున్ పరిహార్ అనే మహిళ ఫస్ట్ అటెంప్ట్‌లోనే గెలిచారు. 29 ఏళ్ల ఈమె జస్ట్ 500 ప్లస్ ఓట్ల మెజారిటీతోనే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సజాద్ అహ్మద్ కిచ్లూపై విజయం సాధించారు. Muslim-dominated seat అయిన కిశ్వర్ అసెంబ్లీ స్థానం నుంచి ఒక ముస్లిం సీనియర్ నేతపైననే ఆమె గెలవడం ప్రాధాన్యం ఏర్పడింది. ఆమె తండ్రి, అజిత్ పరిహార్, మామ అనిల్ పరిహార్ ఇద్దరూ 2018 న జరిగిన ఉగ్రదాడిలో చనిపోయారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో గెలిచిన ముగ్గురు మహిళల్లో ఈమె ఏకైక బిజెపి మహిళా అభ్యర్థి కూడా. తన తండ్రి, మామ ఉగ్రదాడుల్లో చనిపోయే టైంకి ఆమె పీజీ చదువుతుండగా.. ఎలాంటి ఆలోన లేకుండానే రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటారు. టెర్రరిస్టు చర్యలు విపరీతంగా ఉండే కిష్త్వార్‌లో షగున్ పరిహార్‌ను తమ అభ్యర్థిగా పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించడమే ఒక సాహసోపేతమైన నిర్ణయంగా చెబుతారు. ఇక్కడ అధికమైన ముస్లిం జనాభా.. అతి తక్కువ హిందూ సమాజం మధ్య ఆమె గెలిచారు. తనకు వేసే ప్రతి ఓటు తనకు చెందదని.. జమ్మూ & కశ్మీర్‌లో ఉగ్రవాదుల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి వస్తాయనే నినాదంతో ఆమె ప్రచారంలో ముందుకు వెళ్లారు. సెప్టెంబరు 14న దోడా జిల్లాలో జరిగిన తన మొదటి ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆమె విషాద నేపథ్యాన్ని కూడా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే బీజేపీ సంకల్పానికి ఆమె ప్రత్యక్ష ఉదాహరణ అని మాట్లాడారు.