Anant Ambani gifts 2Cr Worth Watches |పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ కి కళ్లు చెదిరే గిఫ్టులిచ్చిన అంబానీ

Continues below advertisement

 అంబానీ పెళ్లి గురించి తెలిసిందేగా మూడు రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకల కోసం వేలాది కోట్ల రూపాయలు అలా అలా ఖర్చు చేసేశారు. బాలీవుడ్, హాలీవుడ్ , క్రికెటర్లు, రాజకీయనాయకులు తేడా లేకుండా దేశంలో ఉన్న సెలబ్రెటీలు అంతా అంబానీ పెళ్లిలోనే కనిపించారు. వచ్చారు సరే ఆ ఆతిథ్యం, ఆ వైభవం అన్నీ చూసి వెళ్లిపోతే అంబానీల స్థాయి ఏం ఉంటుంది. అందుకే అనంత్ అంబానీ ఓ ప్లాన్ చేశారు. తన పెళ్లికి వచ్చిన ఆశీర్వదించిన ఫ్రెండ్స్ కోసం వాచీలు గిఫ్ట్ ఇచ్చారు. ఆ ఏముంది ఓ వెయ్యి రెండో వేలు పెడితే మంచి వాచీలు వస్తాయి కదా అనుకోవచ్చు. కానీ ఈ వాచీ విలువ ఒక్కోటి 2 కోట్ల రూపాయలు. పెళ్లికి ముందే తన స్నేహితుల కోసం  అనంత్ అంబానీ ఈ ఖరీదైన గిఫ్టులను పంపగా వీటిని ధరించే షారుఖ్ ఖాన్, రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్ లాంటి స్టార్లంతా పెళ్లికి వచ్చారు. అంతే కాదు వాచీ గిఫ్టు వచ్చిన దోస్తులంతా ఇదిగో ఇలా తమ చేతులకున్న వాచీలను చూపిస్తూ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ఆడుమాస్పీగే కంపెనీ కి చెందిన రాయల్ ఓక్ పర్పచ్యువల్ క్యాలెండర్ వాచెస్ లిమిటెడ్ ఎడిషన్. కేవలం అంబానీల కోసమే ఈ మోడల్ లో రోస్ గోల్డ్ కలర్ వాచీలను తయారు చేశారు ఆ కంపెనీ వాళ్లు. ఇంతకీ పెళ్లి రోజు అంబానీ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా అక్షరాలా 54కోట్ల రూపాయలు. రిచర్డ్ మిల్లే ఆర్ఎం సిరీస్ కి చెందిన లగ్జరీ టైమ్ పీస్ ను ధరించారు అనంత్ అంబానీ. ఇదే కాదు ఇంతకుముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లోనూ అనంత్ అంబానీ వాచ్ వైరల్ గా మారింది. అప్పుడు లక్షలకోట్లకు అధిపతి అయిన మార్క్ జుకర్ బర్గ్ భార్య ప్రిస్కిల్లా అనంత్ అంబానీ వాచ్ చూసి ఆశ్చర్యపోయి దీని ఖరీదు ఎంత అని అడిగితే...అనంత్ అంబానీ 18కోట్ల రూపాయలని చెప్పటంతో ప్రిస్కిల్లా, మార్క్ జుకర్ బర్గ్ ఆశ్చర్యపోయిన ఘటన అప్పట్లో వైరల్ అయ్యింది . మళ్లీ ఇప్పుడు ఇది. అనంత్ అంబానీ తనకున్న ఖరీదైన వాచీల కలెక్షన్ హాబీ తన పెళ్లి ద్వారా బయట ప్రపంచానికి తెలిసిందన్నమాట.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram