Puri Ratna Bhandar Mystery Explained in Telugu : పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం మిస్టరీ ఏంటీ.? | ABP

Continues below advertisement

 పూరీ జగన్నాధుడి ఆలయంలో రత్న భాండాగారం. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసలు ఏంటీ ఈ రత్న భాండాగారం. దాన్ని ఓపెన్ చేయటం చుట్టూ ఎందుకంత మిస్టరీ క్రియేట్ ఉంది. ఈ వీడియోలో తెలుసుకుందాం.

  పూరీ జగన్నాథుని ఆలయంలానికి రత్న భాండాగారం కథ ఇది.  దేశవ్యాప్తంగా దీని మీద ఆసక్తికర కథలు వినిపిస్తున్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి నేలమాళిగల గురించి ఇలాంటి మిస్టరీనే ఉండేది. అప్పట్లో ఓ గది మినహా మిగిలిన గదులను ఓపెన్ చేసి అనంతపద్మనాభుడిని ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా ఆ గుడికి ఓ గుర్తింపు ఇచ్చారు. ఇప్పుడు అచ్చం అలాంటి కథే ఈ పూరీ జగన్నాధుడి రత్న భాండాగారానిది.

పూరీ జగన్నాథుడి రత్నభాండాగారం లోపల ఎవరూ ఊహించనంత సంపద ఉందని, ఆ నిధులకు విష సర్పాలు కాపలా కాస్తున్నాయని కొందరు చెబుతున్నారు. అందుకే అధికారులు గదిని తెరిచేందుకు భయపడుతున్నారు. అయితే...ఈ భాండాగారాన్ని తెరిచేందుకు ఓ SOP స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ అంటారు. గుడి రత్నభాండాగారం ఎలా తెరవాలని ఓ శాసనాల గ్రంథం రాసుకున్నారన్నమాట. వాస్తవానికి  46 ఏళ్ల క్రితం ఈ భాండాగారాన్ని ఓసారి ఓపెన్ చేశారు. బట్ మళ్లీ ఇప్పటివరకూ లేదు.  బీజేపీ అయితే ఒడిషా లో ఈ రత్నభాండాగారం ఓపెన్ చేయిస్తామనే అంశాన్ని అజెండాగా పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది గెలిచింది కూడా. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram