Hindupur District Demand : హిందూపురంలో జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు బందుకు పిలుపు
Continues below advertisement
అనంతపురం జిల్లా హిందూపురంలో, జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు బందుకు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆర్టీసీ సర్వీసులు దుకాణాలు బంద్ పాటించారు. హిందూపురం జిల్లా ఏర్పాటు చేసేందుకు అఖిలపక్ష నాయకులు ఉదయం నుంచే అన్ని దుకాణాలను మూసివేయించారు. హిందూపురం లోని మేలపురం కూడలి లోని తెలుగు తల్లి విగ్రహం నుండి అఖిలపక్ష నాయకులు భారీ ర్యాలీగా వెళ్లారు.
Continues below advertisement