టాటా స్కై - DTH మరియు పే టీవీ ప్లాట్‌ఫారమ్ ప్రొవైడర్- TATA PLAY గా రీబ్రాండ్ చేయబడింది
టాటా స్కై - DTH మరియు పే టీవీ ప్లాట్‌ఫారమ్ ప్రొవైడర్- టాటా ప్లేగా రీబ్రాండ్ చేయబడింది. దీనిద్వారా కంపెనీ తన వ్యాపార సేవలు డైరెక్ట్ టు హోమ్ సేవలకు మించి పెరుగుతాయని సంస్థ పేర్కొంది. దీని ద్వారా టాటా ప్లే సబ్‌స్క్రైబర్‌లు తమ మెంబర్‌షిప్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సెస్ చేయగలరని ప్రకటన లో పేర్కొంది. మొత్తం 13 రకాల OTT సేవలను అందుబాటులోకి తెచ్చింది.OTT మరియు బ్రాడ్‌బ్యాండ్‌లోకి ప్రవేశించడం ద్వారా మరింత మంది యూజర్స్ కి చేరువ కాగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. DTH వ్యాపారానికి మించి బ్రాండ్ గుర్తింపు కోసం ఇదే సమయం అని మేము నమ్ముతున్నామని టాటా ప్లే MD హరిత్ నాగ్‌పాల్ వివరించారు.రిలయన్స్ త్వరలో OTT ప్రపంచం లోకి రాబోతోందని వార్తలొస్తున్న టైం లో టాటా స్కై, టాటా ప్లే గా మారడం టాక్ అఫ్ ది మార్కెట్స్ అయింది.