Govt Employee Associations: హెచ్ఆర్ఏ వ్యవహారంపై సీఎంవో అధికారులతో సమావేశమైన ఉద్యోగ సంఘాలు

Continues below advertisement

ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అంశంపై నిన్న రాత్రి వరకూ ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగిన ఉద్యోగ సంఘాల నేతలు... ఇవాళ ఉదయం మరోసారి సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఫిట్మెంట్ పై ఉద్యోగులంతా అసంతృప్తిగా ఉన్న వేళ.. గత ప్రభుత్వం కల్పించిన రాయితీల్లో కోతలు వేయడం సరికాదని కోరారు ఉద్యోగులు. సంక్రాంతి ముగిసే వరకు హెచ్ఆర్ఏ సహా ఇతర అంశాలకు సంబంధించిన జీవోలు విడుదల చేయబోమని సీఎంవో అధికారులు హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై సీఎంఓ అధికారులతో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు చర్చించారు.అనంతరం బండి శ్రీనివాసులు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. హెచ్ఎస్ఏపై అధికారు నుంచి స్పష్టత రాలేదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram