DecadeforBrandSuryaBhai: బిజినెస్ మేన్ సినిమా రిలీజై నేటికి పదేళ్లు | Mahesh Babu
సూర్యాభాయ్... ఇది పేరు కాదు.. ఇట్స్ ఎ బ్రాండ్ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు బిజినెస్ మ్యాన్ లో చెప్పిన డైలాగ్ ఇది. అయితే ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారా. అవసరమేనండీ ఎందుకంటే Businessman సినిమా రిలీజై ఇవాళ్టికి పదేళ్లు పూర్తైంది. ఈ మేరకు మహేశ్ బాబు ఫ్యాన్స్ ట్విటర్ లో డికేడ్ ఫర్ బ్రాండ్ సూర్యాభాయ్ ను ట్రెండ్ కూడా చేశారు. సినిమా స్టిల్స్ అన్నీ పెట్టి మహేశ్ బాబు చేసిన రచ్చను మరోసారి గుర్తుచేసుకున్నారు. ఒంగోలులో అయితే మహేశ్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.