Allegations on Minster Anil's uncle: మంత్రి అనిల్ బాబాయ్ కు వ్యతిరేకంగా ఆందోళన
మంత్రి అనిల్ బాబాయ్, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్యాయం చేశారంటూ బాధితులు రోడ్డెక్కారు. తమ ఆస్తిని స్వాధీనం చేసుకుని, డబ్బులివ్వకుండా వేధిస్తున్నారంటూ రామిరెడ్డి, అతని కుటుంబసభ్యులు నిన్న రాత్రి నడి రోడ్డుపై నిరసనకు దిగింది. పుత్తా ఎస్టేట్స్ కి సంబంధించిన స్థల వివాదంలో ఈ ఆరోపణలు వచ్చాయి. డబ్బులు అడుగుతుంటే ఇంటిపైకి పోలీసుల్ని పంపించారంటూ బాధితులు ఆరోపించారు. ఘటనాస్థలానికి చేరుకున్న తెలుగుదేశం నాయకులు వాళ్లకు మద్దతు తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు స్టేషన్ కు తరలించారు.