Glenn Maxwell : బిగ్ బాష్ లీగ్ లో మాక్స్ వెల్ విశ్వరూపం...టీ20 చరిత్రలోనే అత్యధికస్కోరు

Continues below advertisement

బిగ్‌బాష్‌లో లీగ్‌లో కొత్త రికార్డు నమోదైంది. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. ఆర్సీబీ రిటైన్ చేసుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ 64 బంతుల్లోనే 154 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఏకంగా 22 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మ్యాక్సీతో పాటు మార్కస్ స్టోయినిస్ (75 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు) కూడా రాణించారు. 20 ఓవర్లు ముగిసేసరికి మెల్‌బోర్న్ స్టార్స్ రెండు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. బిగ్ బాష్ లీగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం.టీ20 లీగ్‌ల్లో ఇది అత్యధిక స్కోరు. 2019లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (267/2) స్కోరు రెండో స్థానానికి పడిపోయింది. ఇక మూడో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (263/5) ఉంది. తమ రికార్డును వెనక్కి నెట్టినప్పటికీ ఆర్సీబీ హ్యాపీనే. ఎందుకంటే మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రూ.11 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఓపెనర్‌గా కూడా రాణించాడు కాబట్టి ఐపీఎల్‌లో కూడా మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ ఓపెనర్‌గా ఉపయోగించే అవకాశం ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram