Flying Cars: ఎగిరే కార్లకు స్లోవేకియా ప్రభుత్వం అనుమతి
Continues below advertisement
Flying Carsకి స్లోవేకియాలో గ్రీన్ సిగ్నల్ లభించింది. గంటకు 160 మైళ్ల వేగంతో, 8వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేసే సామర్థ్యం గల ఫ్లైయింగ్ కారుకు స్లోవాక్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. 70 గంటల పాటు 200 టేకాఫ్స్, ల్యాండింగ్స్ ని పరీక్షించాక ఈ అనుమతి జారీ చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రావటంతో, దీన్ని తయారు చేసిన కంపెనీ... ఈ కార్ల ప్రొడక్షన్ కు అన్నీ సిద్ధం చేసుకుంటోంది. రోడ్డు మోడ్ నుంచి ఫ్లైయింగ్ మోడ్ కు మారడానికి ఈ కారుకు 3 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ ఎయిర్ కారుకు 160 హార్స్ పవర్ BMW ఇంజిన్ అమర్చారు. ఇందులో ఇద్దరు కూర్చునే వీలుంది. దీన్ని మరింత అడ్వాన్స్ డ్ గా మార్చేందుకు ఇంజినీర్లు కృషి చేస్తున్నారు.
Continues below advertisement