CJI NV RAMANA: శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ|
Continues below advertisement
తిరుమల శ్రీవారి దర్శనం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి అతిధి గృహం వద్ద భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి,ఈవో కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డిలు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.. వీరితో పాటుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు పలువురు న్యాయమూర్తులు కూడా భారత ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు..రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం గుండా తిరుమల శ్రీవారిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు..
Continues below advertisement