Bheemla Nayak: పవర్ స్టార్ సినిమాకి తుదిమెరుగులు.. అన్నీ కుదిరితే ఫిబ్రవరి 25న రిలీజ్

Continues below advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వస్తున్న పవర్ ఫుల్ సినిమా భీమ్లానాయక్. అయితే ఈ సినిమాను జనవరి 9న రిలీజ్ చేద్దామనుకున్న కొవిడ్ కేసుల పెరుగుదల, థియేటర్లలో 50 శాతం ఆక్యూపెన్సీ దృష్ట్యా వాయిదా వేశారు. ఇప్పుడు తాజాగా భీమ్లానాయక్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఫిబ్రవరి రెండో వారం లోపు సినిమా ఫైనల్ కాపీ రెడీ అయిపోతుందని సినీవర్గాలు చెబుతున్నారు. అన్నీ కుదిరి పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram