Smallest Ceiling Fan: అతి సూక్ష్మ సీలింగ్ ఫ్యాన్ తయారుచేసిన కళాకారుడు..
కాకినాడకు చెందిన ఆరిపాక రమేష్ బాబు సూది రంధ్రంలో ఇమిడేంత అతి సీక్ష్మ కళాఖండాలు రూపొందించి ఎన్నో ప్రపంచ రికార్డులు సంపాదించారు. గతంలో అతి సూక్ష్మ సీలింగ్ ఫ్యాన్ తయారు చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. అదే స్ఫూర్తితో మరింత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రపంచంలోకెల్లా అతి సూక్ష్మ సీలింగ్ ఫ్యాన్ ను రూపొందించి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి బహుకరించారు. 1.5 సెంటిమీటర్ల పొడవున్న ఈ ఫ్యాన్ 3 వోల్ట్ బ్యాటరీతో పని చేస్తుందని దీన్ని ఆపరేట్ చేయడానికి ఆన్/ఆఫ్ స్విచ్ అమర్చినట్టు ఆయన పేర్కొన్నారు.