Bangladesh Funny cricket: ఏది ఇప్పుడు చేయండి నాగిన్ డ్యాన్స్ ?

Continues below advertisement

బంగ్లాదేశ్... క్రికెట్ లో పసికూన నుంచి గత కొన్నేళ్లలో మెచ్చుకోదగ్గ రీతిలో ఎదిగింది. అభినందనీయమే. కానీ ఆన్ ఫీల్డ్ లో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడంలో, మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయడంలో, సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉండటంలో ఇప్పటికీ పసికూనే అనుకోవచ్చేమో. ఇంతకముందు నాగిన్ డ్యాన్స్, మ్యాచ్ గెలవకముందే సంబరాలు, దారుణమైన రివ్యూలతో పేరు చెడగొట్టుకున్న ఈ బంగ్లా పులులు (🤔🤷‍♂️😱)ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చారు. ఒకే బాల్ కి వెరైటీ రీతిలో ఏడు పరుగులు సమర్పించుకున్నారు. కివీస్ తో తొలి టెస్టులో అదిరే పర్ఫార్మెన్స్ చేసిన ఎబాదత్ హొస్సేన్.. రెండో టెస్టులో 27వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. అతని బంతిని కివీస్ బ్యాటర్ విల్ యంగ్ ఎడ్జ్ చేశాడు. దాన్ని స్లిప్స్ లో నేలపాలు చేశారు. క్యాచ్ డ్రాప్ అన్న బాధతో ఎబాదత్ వెనక్కి వెళ్తుండగా... డీప్ ఫైన్ లెగ్ నుంచి బౌలర్ ఎండ్ వైపు త్రో విసిరారు. అప్పటికే బ్యాటర్లు 3 పరుగులు తీశారు. ఆ త్రోను ఆపడానికి స్వయానా ఎబాదత్ బౌండరీ వరకు పరిగెత్తాల్సి వచ్చింది. ఆపలేక 3+4 ఓవర్ త్రోలు కలుపుకుని ఏడు పరుగులు సమర్పించుకున్నట్టైంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram