AP New Districts పై ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం ఉందన్న BJP Somu Veeraju.
Continues below advertisement
పీఆర్సీ కు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లా ల ఏర్పాటు ను అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారని బి జె పి, రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటుచేసే ముందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమే అన్న వీర్రాజు,మౌలిక సదుపాయాలు సమకూర్చుకోకుండా కొత్త జిల్లాల ఏర్పాటు సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కంటే తన సొంత ఎజెండాను అమలు చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయనఆరోపించారు.
Continues below advertisement