Ajay Jain: గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు వెంటనే విధులకు హాజరుకావాలి

Continues below advertisement

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా వెంటనే విధులకు హాజరు కావాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ చెప్పారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ పై సమీక్ష నిర్వహించిన ఆయనకు.. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పదకొండు శాఖలతో అనుబంధం కలిగిన విభాగాలు ఉన్నందున ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమైందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అన్ని అర్హతలు కలిగిన వారు 60 వేల మంది ఉన్నట్లు ఇప్పటికే గుర్తించామని, మిగతావారు కూడా అర్హత సాధించిన వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామన్నారు. ఇబ్బందులు తలెత్తుతాయని సచివాలయ ఉద్యోగులు భావించాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సచివాలయ ఉద్యోగుల ను రెచ్చ గొడుతున్నారని, అపోహలు సృష్టించాలని చూస్తున్నారని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram