Karimnagar Cutout: కరీంనగర్ లో భారీ వర్షం...ఈదురుగాలులకు కూలిన భారీ కటౌట్..!
కరీంనగర్ లో బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాటు చేసిన 70 అడుగుల భారీ కటౌట్ ఈదురుగాలులు, వర్షానికి కుప్ప కూలింది. వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా కరీంనగర్ నడిబొడ్డున ఉన్న తెలంగాణ చౌక్ వద్ద రానున్న బ్రహ్మోత్సవాల కోసం ఒక భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. రోజు అటుగా వెళ్తున్న జనాలకి ఆ ప్లేస్ ఒక ఆకర్షణీయ ప్రదేశం గా మారింది .ప్రజలు అక్కడ చేరి కొద్దిరోజులుగా సెల్ఫీలను సైతం దిగుతున్నారు. అయితే కటౌట్ కూలిన సమయంలో భారీ వర్షం పడుతుండడంతో, ఎవరూ లేకపోవడం.... పైగా వాహనాల రద్దీ కూడా తక్కువగా ఉండడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ... ప్రజలకు గాయాలు కానీ తగల్లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.