HariHara Veeramallu: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' నుంచి కొత్త అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక సినిమా 'హరి హర వీర మల్లు'. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో, ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ఆ సినిమాలోని పాత్రే బెస్ట్ అని నిధి అగర్వాల్ అన్నారు. 'హీరో' సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా ఆమె నటించారు. సంక్రాంతి సందర్భంగా ఆ సినిమా విడుదల అవుతోంది. అందుకని, మీడియాతో ముచ్చటించిన నిధి అగర్వాల్... 'హరి హర వీర మల్లు' గురించి కూడా చెప్పారు. "నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు'. అలాగే, బెస్ట్ క్యారెక్టర్ కూడా ఆ సినిమాలోనే వచ్చింది. ఫస్ట్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో సెకండ్ హాఫ్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇది పీరియాడిక్ ఫిల్మ్. ఇందులో ఒక్క లుక్ అని కాదు... డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ఉంటాయి" అని నిధి అగర్వాల్ చెప్పారు. అవకాశం వస్తే మళ్లీ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఉందని, ఆయనతో నటించాలని ఉందని తన మనసులో మాటను వెల్లడించారామె.