83 Movie OTT Release: రణ్ వీర్ సింగ్ 83 సినిమా ఓటీటీ రిలీజ్ విశేషాలు
Continues below advertisement
హర్యానా హరికేన్ కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం '83'. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ , కపిల్ భార్య రోమి పాత్రలో నిజజీవితంలో రణ్‌వీర్ భార్య దీపికా పదుకోన్ నటించారు. థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే కరోనా కాలంలో విడుదలైన ఈ సినిమాను ఫిబ్రవరి 18న ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. కానీ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయాలా లేకపోతే నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వాలా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఎక్కువ శాతం హాట్ స్టార్ లో వచ్చే అవకాశాలున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం.
Continues below advertisement