‘Thalaivi’ Movie:‘జయలలిత’ సమాధి సందర్శించిన రీల్ తలైవి కంగనా రనౌత్..
Continues below advertisement
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా కంగనా నటించిన తాజా సినిమా ‘తలైవి’. ఈ సినిమాలో అమ్మ పాత్రలో క్వీన్ కంగనా కనిపిస్తోంది. ఏప్రిల్లో విడుదలకావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 10న వినాయక చవితి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కంగనా .. చెన్నైలోని జయలలిత సమాధిని సందర్శించి నివాళులు అర్పించింది. తొలుత తలైవి సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. థియేటర్ ఓనర్ల ఆందోళనతో ఆలోచన మార్చుకున్నారు. మొదట థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అంగీకరించారు. థియేటర్లో విడుదలైన రెండు వారాల తర్వాత OTT ప్లాట్ ఫామ్ సందడి చేయనుంది. ఈ సినిమాలో కంగనాతో పాటూ అరవింద స్వామి, సామ్నా కాసిమ్, సముతిరాకాని, భాగ్యశ్రీ, ప్రియమణి నటిస్తున్నారు.
Continues below advertisement