బాలకృష్ణ తనయుడి బర్త్ డే వేడుకలపై వివాదం.. పోలీసుల లాఠీఛార్జ్!
Continues below advertisement
గుంటూరు జిల్లాలో మరో వివాదం చోటుచేసుకుంది. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలపై వివాదం రాజుకుంది. చేబ్రోలు మండలం వడ్లమూడి వద్ద కొందరు యువకులు మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. బర్త్‌డే వేడుకలు చేసిన విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీ ఛార్జ్ జరిగింది. విద్యార్థులను తరిమి కొటట్డంపై దుమారం రేగుతోంది. ప్రస్తుతం విజ్ఞాన్ యూనివర్సిటీ యాజమాన్యం అధికార పార్టీ వైసీసీతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే బాలకృష్ణ కుమారుడి పుట్టిన రోజు వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాఠీఛార్జ్ చేశారా అంటూ పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Continues below advertisement