Guntur Video: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. స్కూల్లోనే టీచర్‌పై దాడి
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయులపై విద్యార్థిని బంధువులు దాడి చేశారు. విద్యార్థినిపై టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని స్కూల్‌కు వచ్చి వచ్చిన బంధువులు గొడవకు దిగారు. మరోవైపు తాను తప్పుగా ప్రవర్తించలేదని ఉపాధ్యాయుడు చెప్పినా వినకుండా విద్యార్థిని బంధువులు దాడికి పాల్పడ్డారు. చదువు విషయంలో మందలించానని టీచర్ వివరణ ఇచ్చుకున్నారు. అడ్డుకోబోయిన తోటి ఉపాధ్యాయులపై కూడా విద్యార్థిని బంధువులు దాడికి దిగారు. స్కూళ్లో ఏం జరుగుతుందో తెలియక విద్యార్దులు భయపడిపోయారు.