Team Kannappa at Cannes Film Festival 2024 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ క్లాస్ షో | ABP
కన్నప్ప (Kannappa Movie)... డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్. తెలుగులో, ఇతర దక్షిణాది భాషల్లో కొంత మంది హీరోలు కన్నప్ప కథను తెరకెక్కించారు. అయితే... ఇంటర్నేషనల్ లెవల్‌లో, భారీ ఎత్తున, అత్యంత ప్రతిషాత్మకంగా రూపొందిస్తున్నారు విష్ణు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివిధ భాషల్లో అగ్ర తారలను సినిమాలో కీలక పాత్రలకు తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో గొప్ప ఈవెంట్ చేశారు. అదే ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు కన్నప్ప సినిమాను తీసుకువెళ్లటం.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మంచు మోహన్ బాబు కుటుంబం తళుక్కుమంది. భక్త కన్నప్ప సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మంచు కుటుంబం ఫ్రాన్స్ లో పర్యటించి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు బ్లాక్ సూట్స్ లో తళుక్కుమన్నారు. విష్ణుతో పాటు ఆయన వైఫ్ వెరోనికా రెడ్డి కూడా ఉన్నారు. కన్నప్పతో టీమ్ తో పాటు ప్రభుదేవా కూడా కేన్స్ లో పార్టిసిపేట్ చేశారు. కన్నప్ప సినిమా గ్లింప్స్ ను కేన్స్ లో విడుదల చేస్తామని ఇప్పటికే విష్ణు ప్రకటించారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు కన్నప్ప సినిమా తీసుకువెళ్లటం ద్వారా తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లామని మంచు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.
విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, పద్మశ్రీ పురస్కార గ్రహీత - లెజెండరీ నటుడు - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.