Actor Srikanth Bangalore Rave party | రేవ్ పార్టీలో దొరికిన శ్రీకాంత్..? ఆయనేం అంటున్నారంటే.? | ABP

శతాధిక చిత్ర కథానాయకుడు, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ పేరు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా న్యూస్ ఛానళ్లలో మార్మోగుతోంది. బెంగళూరు నగరంలో జరిగిన ఓ రేవ్ పార్టీ మీద రైడ్ చేసిన అక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు పలువుర్ని అరెస్ట్ చేశారు. పోలీసులు పట్టుకున్న వ్యక్తుల్లో టాలీవుడ్ నటీనటులు, మోడల్స్ సైతం ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పట్టుబడ్డ వ్యక్తుల్లో శ్రీకాంత్ ఉన్నారని కొందరు వార్తలు ప్రసారం చేస్తున్నారు.శ్రీకాంత్ మాట్లాడుతూ ''నేను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లో ఉన్నా. బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లిన‌ట్లు, అక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేసిన‌ట్లు ఫోనులు వ‌చ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్ చూశా. కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేసి వార్త రాయలేదు. కొందరు ఆ వీడియో ప్రసారం చేశారు. అది చూసి నేను, మా ఫ్యామిలీ న‌వ్వుకున్నాం. ఇటీవల నాకు, నా భార్య‌కు విడాకులు ఇప్పించారు. ఇప్పుడు ఆ రేవ్ పార్టీకి వెళ్లానన్నారు. ఆ రేవ్ పార్టీలో దొరికిన‌ వ్యక్తి ఎవరో కొంచెం నాలా ఉన్నాడు. అత‌డికి కొంచెం గ‌డ్డం ఉంది. కానీ, ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. అతడిని చూసి నేనే షాక‌య్యా'' అని చెప్పారు.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola