Samantha Divorce: కోట్లు సంపాదించే సమంతకు కేవలం పాకెట్ మనీ ఇచ్చేవారు!
Continues below advertisement
టాలీవుడ్ హిట్ పెయిర్ నాగ చైతన్య, సమంత ఇటీవల విడిపోయారు. తమ విడాకుల విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీరి ఫ్యాన్స్ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చైతూ, సామ్ విడాకులకి కారణం ఏంటి అన్నది అందరూ చర్చిస్తున్నారు. ఈ విషయంపై పలువురు సెలెబ్రిటీలు స్పందించారు. తాజాగా నటి మాధవీలత ఫేస్‌బుక్‌లో స్పందించారు. సమంతను ఆమె సమర్థించారు. " సమంత చాలా మంచి మనసు గల వ్యక్తి. నాగ చైతన్య ఆధ్వర్యంలోనే సినిమాల్లో నటిస్తోంది. తను క్రిస్టియన్ అయినా చాలా సార్లు తిరుపతికి సైతం వెళ్లింది. కోట్లు సంపాదించినా సమంత పాకెట్ మనీ కోసం ఇబ్బందులు పడ్డారని" నటి మాధవీలత తన ఫేస్‌బుక్ లైవ్‌లో పేర్కొన్నారు.
Continues below advertisement