MAA Elections: మా ఎన్నికలపై స్పందించిన రవిబాబు.. తన ఓటుపై క్లారిటీ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సినీ ఇండస్ట్రీలో వేడి పుట్టిస్తున్నాయి. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారో అని అందరికీ ఒక ప్రశ్నలా మారింది. తాజాగా డైరెక్టర్, నటుడు రవిబాబు మా ఎన్నికలపై స్పందించారు. తెలుగువారికే ఆయన ఓటు అని స్పష్టం చేశారు. చాలా మంది నిర్మాతలు పరాయి భాష నుండి నటులను తెచ్చుకుంటున్నారని చెప్పారు. చాలా మంది తెలుగు కెమెరా మ్యాన్ లు ఉపాధి లేక కాళీగా ఉన్నారని తెలిపారు. అందరూ తెలుగు వాళ్లకే ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు.