Taraka Ratna Wife Emotional : తారకరత్న గుండెల్లో బాధ ఎవరూ అర్థం చేసుకోలేదు | ABP Desam

Continues below advertisement

నందమూరి ఫిబ్రవరి 18న మరణించారు. నెల రోజుల తరువాత ఆయన భార్య అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తారక రత్న మరణించి నెల రోజులైనా ఆయన జ్ఞాపకాలు తన మనసులో ఇంకా సజీవంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తమ ప్రయాణం మొదలైన రోజులను గుర్తు చేసుకున్నారు. 

''మనం కలిశాం, మనం మంచి స్నేహితులు అయ్యాం, మనం డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాం... మన బంధం గురించి అప్పట్లో నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పటికీ... మన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావ్. ఆ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి నువ్వు యుద్ధం చేయడం స్టార్ట్ చేశావ్'' అని తమ ప్రయాణం సంగతులు చెప్పుకొచ్చారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram