అనాధ బాలికల హాస్టల్ లో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న లావణ్య త్రిపాఠి
Continues below advertisement
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠీ తన పుట్టినరోజును అనాథ శరణాయలంలో జరుపుకొన్నారు. హైదరాబాద్, బల్కంపేటలో అనాథ బాలికల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ వసతి గృహం (గవర్నమెంట్ లేడీస్ హాస్టల్)లో ఆమె కేక్ కట్ చేసారు. అక్కడి బాలికలకు పుస్తకాలు, బ్యాగులు, గేమ్స్ కోసం క్యారమ్ బోర్డు వంటివి అందజేశారు. చాలాసేపు వారితో సరదాగా గడిపారు. పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ, ఆటోగ్రాఫ్ ఇస్తూ, అక్కడ ఉన్న అమ్మాయిలు అందరికీ స్వయంగా కేక్ అందించి అలరించారు లావణ్య.
Continues below advertisement