Kadapa Rains: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన
Continues below advertisement
కడప జిల్లాలో పాపాగ్ని నది వరద ఉద్ధృతికి కమలాపురం బ్రిడ్జి కుంగిపోయింది. కొంత మేర కూలిపోయింది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి క్రమ క్రమంగా కుంగిపోయింది. బ్రిడ్జి మధ్య భాగంలో ఆరు స్లాబులు చీలిపోయి నీటిలోకి క్రమంగా కుంగిపోతున్నాయి. వంతెన కుంగిపోవడంతో శనివారం రాత్రి అప్రమత్తమైన పోలీసులు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. కడప-కమలాపురం మధ్య రాకపోకలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఇరువైపులా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Continues below advertisement