Minister AppalaRaju: మంత్రి అప్పలరాజు పై మండి పడిన కడప జిల్లా ప్రొద్దుటూరు వీఆర్వోలు|

Continues below advertisement

పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలని కడప జిల్లా ప్రొద్దుటూరు వీఆర్వోలు డిమాండ్ చేశారు. శుక్రవారం సచివాలయ విఆర్వోలు విధులు బహిష్కరించ ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం పలాస మున్సిపల్ కమిషనర్ ఓడీఎస్ పై ఏర్పాటు చేసిన సమావేశానికి మున్సిపల్ కార్యాలయానికి రమ్మన్నారు. వీఆర్వో లంతా సమావేశానికి వెళితే కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గెటవుట్ మండిపడ్డారు. విషయాన్ని సమావేశానికి వస్తున్న మంత్రి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆయన వీఆర్వోలు రాజకీయాలు చేస్తున్నారా అంటూ మాట్లాడారని ఇది బాధాకరమన్నారు.‌ మంత్రి సమావేశానికి వెళ్లి మైక్ లో సచివాలయాలకు విఆర్వోలు వస్తే సర్పంచులు, ఎంపీటీసీలు తరిమి కొట్టాలంటూ మాట్లాడారని, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి రెవెన్యూ సిబ్బందిపై ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి లో మాట్లాడడం దురదృష్టకరమన్నారు. మంత్రి ని బర్తరఫ్ చేయాలని, మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని, వీఆర్వోలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram