Kakinda Beach: సాగర తీరం థీమ్ పార్కులో యుద్ధ విమానాల ప్రదర్శన..
తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సాగర తీరంలో థీమ్ పార్కులో ఏర్పాటుచేసిన యుద్ధ విమానాల ప్రదర్శనశాల విశేషంగా ఆకట్టుకుంటుంది.యుద్ధ రంగంలో 28 ఏళ్ల పాటు సేవలందించిన టి యు 142 ఎం అభిమానం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ఇప్పటికే ఇక్కడ శిక్షణ విమానాన్ని ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు.విమానంలో లోపలికి కూడా వెళ్లి పరిశీలించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.విజ్ఞానంతో పాటు వినోదం అందించే దిశగా గుడా ఆధ్వర్యంలో ఇప్పటికే తీం పార్క్ ను ఆహ్లాదంగా మార్చి సిద్ధం చేశారు..