ABP News

రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

Continues below advertisement

కేంద్ర ప్రభుత్వం 4,445 కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఏడు మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌, అప్పరెల్‌ పార్కు (మిత్రా)లలో ఒక దానిని ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కొప్పర్తిలో నెలకొల్పవలసిందిగా రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదించిన మిత్రా పార్కు ద్వారా స్పిన్నింగ్‌, డైయింగ్‌, ప్రింటింగ్‌ వంటి ప్రక్రియలు ఒకే చోట చేపట్టే వీలు కలుగుతుంది. తద్వారా టెక్స్‌టైల్‌ వాల్యూ చైన్‌ యావత్తు ఒకే చోట సమీకృతం అవుతాయి. మిత్రా పార్కులలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. ఫలితంగా రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ పార్కుల ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా టెక్స్‌టైల్‌ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించవచ్చని విజయసాయి రెడ్డి అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram