ముఖ్య అతిథిగా హాజరైన నటుడు, రచయిత తనికెళ్ల భరణి

తిరుపతి మహతి కళాక్షేత్రంలో కుమారి హరి శ్రీనిత భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం లో సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమారి శ్రీనిత అరంగేట్ర భరతనాట్యం ఆహుతులను అలరించింది. దాదాపు రెండున్నర గంటలపాటు ఏకధాటిగా తన నృత్యం ద్వారా అందరినీ మెప్పించి ఆశీస్సులు అందుకుంది. తనికెళ్ల భరణి మాట్లాడుతూ,ఈ విశ్వంలో భారతదేశం విశ్వ గురువుని పేర్కొన్నారు.ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు ఈ ప్రపంచానికి మార్గ నిర్దేశం చేశాయని చెప్పారు. అదేవిధంగా కళలకు పుట్టినిల్లు భారతదేశం అని, ఈ కళల ద్వారానే మన ఆచార వ్యవహారాలు ప్రతి వ్యక్తినీ సన్మార్గంలో నడిచేందుకు దోహద పడతాయని తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola