నెల్లూరు జిల్లా మినుము పంట రైతులు కష్టాలు
Continues below advertisement
నెల్లూరు జిల్లా రైతాంగం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయింది. ప్రధానంగా వరి పంట వేసిన రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మినుము పంట వేసిన రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక్క వింజమూరు పరిధిలోనే 2వేల ఎకరాల్లో మినుము పంటను రైతులు సాగు చేస్తున్నారు. వర్షాలకు పంట నీట మునగడం, తద్వారా తెగుళ్లు వాటిళ్లడంతో రైతులు నష్టాలపాలయ్యారు. మళ్లీ కొత్తగా పంటను సాగు చేసేందుకు సమయం లేకపోవడంతో ఉన్న అరకొర పంటకు ఎరువులు, మందులు పిచికారి చేస్తున్నామని రైతులు తెలిపారు. ఒక ఎకరాకు సుమారు 15 వేల పెట్టుబడి పెడుతున్నామని రైతులు తెలియజేశారు. పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాల ధాటికి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి మునిగిన మినుము పంటకు నష్ట పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.
Continues below advertisement