Tirumala Brahmotsavaalu: మూడోరోజు సింహ వాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి
Continues below advertisement
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం సింహ వాహనంపై దర్శనం ఇచ్చారు. ఆలయంలోని ధ్వజస్తంభం వరకు స్వామి వారిని సింహ వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని మలయప్ప స్వామి వారు అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఈరోజు రాత్రి స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై అభయమిస్తారు.
Continues below advertisement