ABP News

తిరుపతి లో జనవరి 5 నుండి 9 వరకు జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

Continues below advertisement

కబడ్డీ కూతలతో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హోరెత్తించారు. తిరుపతి ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి తిరుపతి కార్పొరేటర్లతో కలిసి ఆడారు.. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ కబడ్డీ పోటీల్లో తిరుపతి నగర పాలక కమిషనర్ గిరీషా,మేయర్ శిరీషా కూడా కబడి కూత పెట్టారు.జనవరి 5 నుండి 9 వరకు జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను తిరుపతి మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను తిరుపతి ప్రజలకు చేరువ చేసేలా ప్రచారం హోరు వేడుకగా సాగుతుంది.. అంతకు ముందు కబడ్డీ సంబంధించి మరో పాటను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram