టీటీడీ సర్వదర్శనం టోకెన్లన్నీ బుక్ చేసుకున్న భక్తులు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడిని సర్వదర్శనం టోకెన్లను అనుకున్న షెడ్యూల్ కన్నా రెండు రోజుల అనంతరం విడుదల చేసింది టీటీడీ. జనవరి మాసంకు సంబంధించి టిక్కెట్లను tirupatibalaji.ap.gov.in టీటీడీ వెబ్ లో విడుదల చేసారు. సర్వదర్శనం టోకెన్లను ఇలా విడుదల చేయడం అలా ఖాళీ అయిపోవడం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే సర్వదర్శనం టిక్కెట్లను పొందారు భక్తులు. కరోనా ఆంక్షలు కారణంగా టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. శ్రీవారి దర్శనం కోసం లక్షలాదిగా వేచి చూస్తున్న భక్తులకు టీటీడీ నుంచి నిరాశ మాత్రం తప్పడం లేదు. ఓమిక్రాన్ ముప్పు పొంచి వున్న నేపథ్యంలో జనవరి మాసంలో కూడా దర్శనం కోటాను టీటీడీ పెంచలేదు. రోజుకీ 10వేల చొప్పున ఈ ఉదయం 9గంటలకు 2లక్షల 60వేల టోకెన్లను ఆన్ లైన్లో విడుదల చేయగా,కేవలం 15నిమిషాల వ్యవధిలోనే టోకెన్లనింటిని భక్తులు బుక్ చేసేసుకున్నారు.