అమరావతి రైతులకు అండగా హైకోర్టు తీర్పివ్వటం సంతోషంగా ఉంది
తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. మూడు రాజధానులు వద్దు,ఒకే రాజధాని ముద్దు అనే లక్ష్యంతో సాగిన ఈ మహా పాదయాత్రకు అన్ని పార్టిలు తమ సంఘీభావంను తెలిపాయని, ప్రజలు పూజ వర్షంతో స్వాగతం పలికారని అమరావతి రైతులు అంటున్నారు.. ప్రజల మంచికోసం చేస్తున్న ఈ మహాపాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు అనే ప్రయత్నాలు చేసినా వాటిని అడ్డుకుని శ్రీవారి పాదాల చెంతకు చేరుకున్నాంమని, ప్రజల కోరిక మేరకు ఏపి సీఎం జగన్మోహన్ అమరావతినే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.. సీఎం అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకూ తమ పోరాటం ఆగదని రైతులు హెచ్చరించారు.. పాదయాత్రలో తాము పడ్డ కష్టాలను తిరుపతిలో బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలి అని బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్న తమకు సభ నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం చేసిందని ఈక్రమంలోన హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, హైకోర్టు తీర్పు తమకు సానుకూలంగా రావడం చాలా సంతోషంగా ఉందంటున్న అమరావతి రైతులతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టూ ఫేస్..