తిరుపతిలో రాత్రికి రాత్రే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు...
Continues below advertisement
అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో వెలసిన ఫ్లెక్సిలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమరావతి రైతుల పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో రాత్రికి రాత్రే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. పేరు., పార్టీ., ఇతర అంశాలు లేకుండా ఆ ఫ్లెక్సిలను ఏర్పాటు చేయడంతో ఎవరు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. 'మీతో మాకు గొడవలు వద్దు... మీకు స్వాగతం.... మాకు మూడు రాజధానులు కావాలి -తిరుపతి ప్రజలు' అంటూ ఫ్లెక్సీలు తిరుపతిలో ఎటు చూసిన దర్శనమిస్తున్నాయి.
Continues below advertisement