Tiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్
Tiger Search Operation in Konaseema: రావులపాలెం పరిసరాల్లో చిరుతపులి జాడలు కనిపించలేదని అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవీ ప్రసాదరావు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి గోదావరి లంకల్లో చిరుతపులిని చూసామని (Leopard in Konaseema) మత్స్యకారులు చెప్పడంతో సోమవారం 6 బృందాలుగా అటవీ శాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్ల ద్వారా లంక భూములను పరిశీలించారు. అలాగే చిరుతపులిని చూశామని చెప్పిన మత్స్యకారులు గంగరాజు, వెంకటేశ్వరరావులతో కలిసి పడవలపై లంకల్లోకి వెళ్ళి చిరుతపులి పాద ముద్రల కోసం అన్వేషించారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదు. డీఎఫ్ఓ (District Forest Officer) ప్రసాదరావు మాట్లాడుతూ రావులపాలెం పరిసరాల్లో చిరుతపులికి (Leopard in Ravulapalem) సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. దీంతో తాత్కాలికంగా గాలింపు చర్యలు నిలిపివేసామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే గోదావరి లంకల్లోకి వెళ్ళే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.